13 June, 2026 | 4:13 AM

ఫ్యాషన్ లైఫ్ స్టయిల్ ఎగ్జిబిషన్‌కు చేవెళ్ల చైర్‌పర్సన్ సమతా రెడ్డి

13-06-2026 01:19 AM

ఎగ్జిబిషన్ లో పాల్గొన్న చేవెళ్ళ నుండి కౌసిలర్ బండారి శైలజ ఆగిరెడ్డి రెడ్డి.

చేవెళ్ళ జూన్ 12(విజయక్రాంతి): మహిళా పారిశ్రామికవేత్తలు, కళాకారులు సృజనాత్మక రంగాల్లో ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో  నిర్వహిస్తున్న స్టైల్ తత్వ -ఎడిషన్ 6 ఫ్యాషన్- లైఫ్స్టైల్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లోని హైటెక్స్ హాల్2లో ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా మహిళాల ఆధ్వర్యంలో 200కు పైగా ప్రముఖ బ్రాండ్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఫ్యాషన్, జ్యువెలరీ, హస్తకళలు, గృహోపకరణాలు, లైఫ్స్టైల్ ఉత్పత్తులు తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

ఎఫ్ ఎల్ ఓ హైదరాబాద్ చైర్పర్సన్ గడ్డం సీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్కు తెలంగాణ ముఖ్యమంత్రి సతీమణి గీతారేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం సతీమణి నందిని, మాజీ జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయలక్ష్మి గడ్వాల్, ఎంఈఐఎల్ డైరెక్టర్ సుధారెడ్డి, చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ ప్రస్తుత కౌన్సిలర్ బండారి శైలజాఆగిరెడ్డి  హాజరయ్యారు. మహిళా వ్యాపారవేత్తలకు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, మార్కెట్ విస్తరణకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.