3 July, 2026 | 8:28 PM

Breaking News

దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •   గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం   •   రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్ రాజర్షిషా   •   ప్రవీణ్ కుమార్‌పై మంత్రి వ్యాఖ్యలు సరికాదు   •   ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే   •  

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

03-07-2026 07:33 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

నూతన మండల అధ్యక్షులను శాలువాతో సన్మానం చేసిన ఎమ్మెల్యే

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తినియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నూతన అధ్యక్షులను శుక్రవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే సామేలు నివాసంలో శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. అందరిని కలుపుకొని పోతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందేలా ప్రతి కార్యకర్తలకు అందుబాటులో వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. 

తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తాను నియోజకవర్గ మొత్తం కలియ తిరిగానని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు తనకు ఎన్నడు లేని విధంగా  52వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని, ప్రజల రుణం ఏనాడు తీర్చుకోలేనిదన్నారు. నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నూతన అధ్యక్షులను నియమించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రోడ్లు, వంద పడకల ఆస్పత్రి, మహిళా శక్తి భవనాలు, నూతన గ్రామ పంచాయతీలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.