దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని భగత్ సింగ్ సెంటర్లో దేవ్ విజన్ సెంటర్ అండ్ ఆప్టికల్స్ సిపిఐ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో కంటి సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారని, దూరం ప్రాంతాలకు వెళ్ళి పరీక్షలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నా నేపథ్యంలో,మండలకేంద్రంలో కంటి వైథ్యశాల పెట్టఢం ఇక్కడే కంటి పరీక్షలు చేసుకుని అవసరమైన కళ్ళజోళ్ళు ఇవ్వడం వలన ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అలాగే ఇక్కడ ప్రజలు ఆర్థికంగా వెనకబడి ఉండడం వల్ల బీద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత ఆపరేషన్లు నిర్వహించే విధంగా యాజమాన్యం దృష్టిసారించాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆళ్లపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గంగమ్మ తల్లి ఆలయానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.






