ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే
03-07-2026 07:48 PM
నిర్మల్,(విజయక్రాంతి): సొన్ మండల కేంద్రానికి చెందిన కట్టె కళ్యాణ్ కు అనారోగ్య కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయించుకున్నారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ 3.50 లక్షల ఎల్వోసీ చెక్కును వ్యక్తికి అందజేశారు. గత సంవత్సర కాలంగా పలు మార్లు నిమ్స్ లో చికిత్స పొందుతున్న కల్యాణ్ కు ఎల్వోసీ ద్వారా ఇప్పటి వరకు 15 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న తమ కుటుంబానికి అండగా ఉన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






