3 July, 2026 | 7:29 PM

విద్యార్థులు చదువుతో పాటు, చేతిరాత మెరుగుపరుచుకుని ఉన్నత లక్ష్యం చేరుకోవాలి

03-07-2026 06:57 PM

నోటు బుక్స్ పంపిణి సందర్బంగా లయన్స్ క్లబ్ పిలుపు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): విద్యార్థులు చేతిరాత పుస్తకాల ద్వారా తమ చేతిరాతను మెరుగుపరుచుకుని, చదువులో రాణిస్తూ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా కృషి చేయాలని లయన్స్ క్లబ్ నేరేడుచర్ల సభ్యులు అన్నారు. శుక్రవారం నాడు జడ్పిహెచ్ఎస్ నేరేడుచర్లలో ప్రధానోపాధ్యాయులు బట్టు మధు,లయన్స్ క్లబ్ అధ్యక్షులు షేక్ యూసుఫ్ ఆధ్వర్యంలో లయన్ క్లబ్ సభ్యులు కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్ ఆర్థిక సహాయంతో నూతనంగా ఆరవ తరగతిలో చేరిన విద్యార్థులకు సుమారు రూ.4,000 విలువైన చేతిరాత పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా దాత మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా ఎదగాలని కోరారు.