ఆర్థికంగా ఎదిగినప్పుడే అద్భుత జీవితం
మహిళా సంఘాల ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి జానకి
మూసాపేట మే 25: ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగినప్పుడే అద్భుత జీవితం అడుగులు వేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా వారోత్సవాలలో మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం దగ్గర మండల మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన ఆర్టీసీ బస్సును జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళా సాధికారతే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు, మే 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ‘మహిళా వారోత్సవాలు‘ నిర్వహిస్తుందని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక, మరియు రాజకీయ సాధికారతను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా, సంపద సృష్టికర్తలుగా ఎదిగేలా చేస్తూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు.






