7 May, 2026 | 2:27 AM

మెట్రో వినతులు

07-05-2026 01:51 AM

ఫేజ్--2, ౩కి అనుమతులివ్వండి

ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలి 

ఎయిర్‌పోర్--ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను ఫేజ్--3 కింద చేపట్టండి

కేంద్రమంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో ఫేజ్--2 కు ఆమో దం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల  శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్ట ర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్--2 సమగ్ర ప్రణాళికను రూపొందించి డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించా మని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి  ఖట్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మెట్రో ఫేజ్--2, మెట్రో ఫేజ్--3 పై కేంద్ర మంత్రితో చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్- 2, ఫేజ్--3  విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్--1ను ఎల్ అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ నుంచి  రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఖట్టర్‌కు సీఎం వివరించారు.

ప్రస్తుతం ఫేజ్- -1 ప్రభుత్వం పరిధిలో ఉండడంతో ఫేజ్--2, ఫేజ్-3 విస్తరణ సులువవుతుంద న్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-2లో ఏడు కారిడార్లతో మొత్తం 122.9 కి.మీ మేర విస్తరణకు, రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డీపీఆర్‌ను  ఇప్పటికే సమర్పించామని సీఎం తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్- 2  ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం,- తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్‌ఫోర్-భారత్ ఫ్యూ చర్ సిటీ కారిడార్‌ను  మెట్రో ఫేజ్--3 గా చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్--3కి సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని కేంద్రమంత్రికి సీఎం తెలిపారు.

ఈ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహా రాల శాఖ కార్యదర్శి కే శ్రీనివాస్, ముఖ్యమం త్రి ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభు త్వ సలహాదారు ఎన్‌వీఎస్ రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్‌సింగ్ పాల్గొన్నారు.