26 August, 2026 | 4:17 AM

విద్యుత్ రంగంలో మౌలిక సౌకర్యాల కల్పన

26-08-2026 02:08 AM

దేవంపల్లి సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

మానకొండూరు, ఆగస్టు 25 (విజయక్రాంతి): విద్యుత్ రంగంలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మౌ లిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు.

మంగళవారం మానకొండూర్ మండలం దేవంపల్లి గ్రామంలో రూ.3.06 కోట్లతో నెలకొల్పిన 33 /11 కేవీ, మానకొండూరు మండలంలో పదవ విద్యు త్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అందులో భా గంగానే విద్యుత్ రంగంలో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు.

వ్యవసాయ పంపుసెట్లకు, గృహ వినియోగదారులకు లోవోల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం విద్యుత్ ఉప కేంద్రాలను నెలకొల్పుతున్నదని చెప్పారు. ఈ క్రమంలో విద్యుత్ను ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో దేవంపల్లి,లలితాపూర్, అన్నారం గ్రామాలకు విద్యుత్ సమస్యలు తీరుతాయన్నారు.

దీని పరిధిలో 675 వ్యవసాయ కనెక్షన్లు, 2316 డొమెస్టిక్ కనెక్షన్లు ఉ న్నాయని, వీటికి లోవోల్టేజీ సమస్య లేకుం డా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. అంతే కాకుండా ఈ సబ్ స్టేషన్ ఏర్పాటుతొ గంగిపల్లి, మానకొండూర్ సబ్ స్టేషన్లకు అదనపు విద్యుత్ లోడ్ భారం తగ్గుతుందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో విద్యుత్ అవసరాలు మరింత పెరిగినా వాటిని ఎదుర్కొనే విధంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని డాక్టర్ కవ్వంపల్లి హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మానకొండూర్ ఎంపీడీవో వీవీ వరలక్ష్మి, తహసీల్దార్ విజయ్ కుమార్, విద్యుత్ శాఖ జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ రవీందర్, డివిజనల్ ఇంజినీర్ ఎం.తిరుపతి, ఏడీలు ఎస్ నరేందర్, ఏఈఈ లు మానకొండూరు, చెంజర్ల సత్యనారాయణ, లక్ష్మణ మూర్తి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు నం దగిరి రవీంద్రచారి, దేవంపల్లి ప్యాక్స్ చైర్మన్ రొంటాల లక్ష్మారెడ్డి, ఊటూరు ప్యాక్స్ చైర్మన్ ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెంచాల కిషన్ రా వు, పార్టీ నాయకులు వరహాల చారి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, మర్రి ఓదెలు, రామిడి తిరుమల్ రెడ్డి, బక్కారెడ్డి,తోట శ్రీనివాస్, రామ్ రెడ్డి, రేవెల్లి రాజలింగం తదితరులు హాజరయ్యారు.