పర్యావరణాన్ని కాపాడాలి
ఎంపీడీవో వి.ప్రవీణ్ కుమార్
శంకర్‌పల్లి, ఆగస్టు 25(విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మండల ప్రజా పరిషత్ అధికారి వి. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చా రు. మంగళవారం మండలం దొంతంపల్లి గ్రామంలో జరిగిన మాస్ ప్లాంటేషన్ లో భా గంగా జరిగిన మొక్కలు నాటే కార్యక్రమ ంలో పాల్గొని మొక్కలను నాటారు. అనంత రం మండలంలోని మహాలింగాపురం గ్రా మంలో రూట్ మ్యాప్ హార్వెస్టింగ్ ప్లాంట్ జ లసిరి కార్యక్రమంలో భాగంగా నిర్మాణం చే యుటకు పనులు ప్రారంభించారు.
ఈ స ందర్భంగా ఏపీటీవో మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు తమ ఇ ళ్ళ ముందు, రైతులు తమ ఖాళీ స్థలాలలో మొక్కలను నాటాలన్నారు. భావితరాలకు ఈ మొక్కలు పెద్ద చెట్లుగా పెరిగి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. చెట్లు ఉంటేనే వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. రూ ట్ మ్యాప్ హార్వెస్టింగ్ ప్లాంట్ జలసిరి తో భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో దొంతాన్పల్లి సర్పంచ్ మ హమ్మద్ అబ్దుల్ అజీజ్, మహాలింగాపురం సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, ఏపీవో నాగభూషణం, ఆయా గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.






