26 August, 2026 | 5:07 AM

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

26-08-2026 02:06 AM

ప్రజల భాగస్వామ్యంతోనే కట్టడి

మహేశ్వరం,ఆగస్టు 25(విజయక్రాంతి): మాదకద్రవ్యాల మహమ్మారిని కేవలం పోలీసు చర్యలతోనే అరికట్టడం సాధ్యం కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే సమర్థంగా కట్టడి చేయగలమని మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణరెడ్డి అన్నారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా పత్రికా సమాచార కార్యాలయం (పిఐబ్ )-హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం మహేశ్వరంలో ‘వార్త’ మీడియా వర్క్‌షాప్ నిర్వహించారు. 

ప్రజా ఉద్యమంగా మారాలి..

 యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇళ్లు, పాఠశాలల నుంచే అవగాహన ప్రారంభం కావాలని డీసీపీ సూచించారు. తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటివరకు 8 వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 30 వేల మందికి పైగా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ఈగల్ ఫోర్స్ ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. డ్రగ్స్ కేసులను రిపోర్ట్ చేసేటప్పుడు మైనర్లు, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచాలని, సమాజంలో ముం దస్తు అవగాహన పెంచేలా మీడియా వ్యవహరించాలని అధికారులు కోరారు.