జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రోడ్డెక్కుతాం
బోథ్.(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ ప్రారంభించారు బోత్ సహకార సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రైతుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కాగా జొన్న పంట అధికంగా పండిందని అయితే ప్రభుత్వం జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు.
లేకుంటే రైతులతో కలిసి రోడ్డు ఎక్కి ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో సోనాల గ్రామ సర్పంచ్ యల్ల బిందుజ సుధీర్ రెడ్డి, బూత్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఓరుగంటి స్వామి సోనాల మండల సర్పంచులు బాబు సింగ్ చౌహన్ వినోద్ మాజీ సర్పంచ్ రామ్ కిషన్ యాదవ్ టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకులు అల్లకొండ పోతన్న, పాటిల్ భీమ్రావు సోమన్న తదితరులు పాల్గొన్నారు






