లారీలు రాక కదలని ధాన్యం బస్తాలు.. ఆందోళనలో అన్నదాతలు
జనగామ,(విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. గత 5 రోజులుగా లారీలు రాకపోవడంతో జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామంలో ధాన్యం నింపిన బస్తాలు 1500 పైన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాలలో నిలిచిపోయాయి. 15 రోజుల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నిలువ చేశారు. వారి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారులు రైసు మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలతో వెళ్లిన లారీ అన్లోడ్ కావడానికి వారం రోజుల సమయం పడుతుంది. మండలంలోని అబ్దుల్ నాగారం గ్రామం నుండి వెళ్లిన లారీ నేటి కూడా అన్లోడ్ కావడం లేదు వారం రోజులుగా తూకం వేసిన వందలాది ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రంలో పేరుకపోయాయి. లారీలు రాక ధాన్యం కదలక పోవడం అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తూకం వేసిన వందలాది బస్తాలు కేంద్రంలో నిల్వ ఉండడంతో వెయిట్ లాస్ అయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయగలరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






