29 April, 2026 | 3:00 PM

Breaking News

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకై పోరాటాన్ని ఉధృతం చేయాలి

29-04-2026 12:09 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుకై పోరాటాన్ని ఉధృతం చేయాలి 

టేకులపల్లి (విజయక్రాంతి): 140వ మేడే ను జయప్రదం చేయాలని  ఐఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం టేకులపల్లి ఐ ఎఫ్ టి యు ఏరియా కమిటీ సమావేశం ఏరియా అధ్యక్షుడు బోడ మంచ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్  మాట్లాడుతూ.. 8 గంటల పని దినం, కనీసవేతనం రూ. 30 వేలు, పని ప్రదేశాలలో భద్రత, అసంఘటితరంగ కార్మికులకు సామాజిక ఉద్యోగ భద్రత కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు. మేడే లో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎఫ్ టియు ఏరియా నాయకులు మూడు బిచ్చు, ఈసం మహేష్, కత్తుల ఎర్రయ్య, మాలోతు తార్య,  డేగటి క్రాంతి కుమార్, కానుగుల వెంకన్న, మేకల వినోదు, గుగులోతు రామారావు  తదితరులు పాల్గొన్నారు.