2 July, 2026 | 11:56 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

జారిపడి ఎమ్మెల్యేకు గాయాలు

23-04-2026 12:18 AM

పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్

పటాన్చెరు, ఏప్రిల్ 22 : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో బాత్ రూంలో కాలుజారి పడడంతో స్వల్పంగా గాయలయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని, తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు. కాగా గూడెం మహిపాల్రెడ్డి అస్వస్థత విషయం తెలుసుకున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం ఆపోలో ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే జీఎంఆర్ త్వరగా కోలుకొని ప్రజాసేవలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.