భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం
02-07-2026 10:14 AM
బేల,జూలై 02(విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బేల లోని పశు వైద్య కార్యాలయ(Veterinary Office) ప్రాంగణం పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ప్రాంగణంలో మురుగు నీరు నిల్వ ఉండటంతో అధికారులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు కూడా కార్యాలయానికి చేరుకోవడంలో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.






