2 July, 2026 | 10:47 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

పారదర్శకంగా అక్రెడిటేషన్ కార్డులు పంపిణీ చేయాలి

23-04-2026 12:16 AM

మెదక్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశంలో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్ పర్సన్, కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఏప్రిల్ 22(విజయ క్రాంతి) : నిజమైన ,అర్హత గల జర్నలిస్టుల కే అక్రిడిడేషన్ కార్డు అందాలని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్ పర్సన్, కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, డిపిఆర్‌ఓ, అధికారులతో  సమావేశం నిర్వహించారు. ముందుగా నూతనంగా నియామకమైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  దరఖాస్తులు ఎన్ని వచ్చాయో అని డిపిఆర్‌ఓ ను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు విధానం, అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా మీడియా అక్రిడిడేషన్ కమిటీ చైర్ పర్సన్, కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు అక్రిడిడేషన్ కార్డుల జారీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ జరగాలన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో మీడియా ఒక ప్రధాన వేదికగా ఉంటుందనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌ఓ రామచంద్ర రాజు, డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ భూపాల్, కమిటీ సభ్యులు అశోక్, గోపాల్ గౌడ్, దేవరాజ్, శ్రీధర్, ఫరూక్ హుస్సేన్, శంకర్ దయాల్ చారి, సురేందర్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస చారి, ఏపీఆర్‌ఓ బాబురావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు