ప్రజా ప్రభుత్వంలో రైతులకు, మహిళలకు సమున్నత స్థానం
సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పార్లమెంట్ సభ్యులు మల్లు రవి
రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పెద్దమందడి మండల కేంద్రం, వెల్టూరు గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మే ఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిలు ప్రా రంభించారు. ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోందని, సన్నారకం వరి ధాన్యానికి బోనస్ కల్పించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి పేర్కొన్నారు.
బుధవారం పార్లమెంటు సభ్యులు మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పెద్దమందడి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వీరు ఐకెపి ఆధ్వర్యంలో పెద్దమందడి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వెల్టూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెండు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనం తరం వడ్ల సంచిని తూకంపై పెట్టి కాంటా చేసి కొనుగోళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు, మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తోం దని, సన్నారకం వరి ధాన్యానికి బోనస్ కల్పించి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. వరి కొనుగోలు కేంద్రా ల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. వరి ధాన్యం అమ్మకానికి వచ్చిన రైతులకు తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి టాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. రైతులకు వారం రోజుల్లో నగదు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇచ్చి రైతులకు అండగా ప్రభుత్వం నిలు స్తోందని తెలిపారు. రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.






