19 June, 2026 | 5:22 AM

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

19-06-2026 12:00 AM

భైంసా ( విజయక్రాంతి): ముధోల్ మండలంలోనివిట్టోలి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం, ఇందిరమ్మ ఇళ్ళను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామ ప్రజలకు అవసరమైన పరిపాలనా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు నూతన పంచాయతీ భవనం ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం గ్రామంలో నిర్మించిన నూతన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు.