22 July, 2026 | 3:58 AM

డ్రైనేజీ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

21-07-2026 12:44 AM

కూకట్‌పల్లి, జూలై 20 (విజయక్రాంతి): ఆల్విన్ కాలనీ సర్కిల్ మహంకాళి నగర్ చౌరస్తా నుండి తులసీవనం అవుట్లెట్ వరకు  నూతనంగా నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు సోమవారం పిఎసి చైర్మన్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పిఎసి చైర్మన్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. పలు కాలనీలలోని ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు సమస్యలను పరిగణలోకి తీసుకొని మహంకాళి నగర్ కాలనీలో రూ. 68 లక్షల 65 వేల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు నేడు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు .

కాలనీలలో మౌలిక వసతులకు ప్రాధాన్యతనిస్తూ, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడ మేనా లక్ష్యం అని గాంధీ తెలియజేశారు. నియోజకవర్గంలో మౌలిక వసతులకు పెద్దపీట వేస్తానని, యుజిడి పైప్‌లైన్ లాంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, జలమండలి అధికారులు జిఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాసరాజు, మేనేజర్ అనిల్, నాయకులు, కార్యకర్తలు, పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.