23 May, 2026 | 1:06 PM

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన

23-05-2026 11:42 AM

మూడు కోట్ల 66 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అమీన్ పూర్ మే 23: పటాన్ చెరు నియోజకవర్గం(Patancheru Constituency) అమీన్పూర్ డివిజన్, బీరంగూడ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీలు, విలీన గ్రామాలలో 3 కోట్ల 66 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి(Development Works) పనులకు శంకుస్థాపనలు చేసిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddyశర వేగంగా అభివృద్ధి చెందుతున్న బీరంగూడ, అమీన్ పూర్ డివిజన్ల పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు.

స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. హాజరైన మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజలు. పాల్గొన్నారు.