23 May, 2026 | 1:05 PM

న్యాయవాదుల రక్షణకై న్యాయవాద రక్షణ చట్టం అవసరం

23-05-2026 11:44 AM

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కోర్టు కాంప్లెక్స్ లో  15 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు పూజా కార్యక్రమం

షాద్ నగర్ మే 23, (విజయక్రాంతి): ఒక వైపు ప్రజా ప్రతినిధులు కానీ,,, మరొకవైపు న్యాయవాదులు కానీ ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతారని.. న్యాయవాదుల పై కక్షలు పెంచుకొని భౌతిక దాడులకు పాల్పడడం సరైన చర్య కాదని, న్యాయవాదులకు రక్షణగా న్యాయవాద రక్షణ చట్టం  ఉండి తీరాల్సిందేనని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అసెంబ్లీలో కూడా చర్చించి బిల్లు పెట్టడం జరిగిందని, దేవరకద్ర ఎమ్మెల్యే జి మసూదన్ రెడ్డి తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ న్యాయవాద రక్షణ చట్టం విషయంపై ముఖ్యమంత్రితో కూడా చర్చించి బిల్లును అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేయించామని అన్నారు.

శనివారం షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్ లో మున్సిపల్ సాధారణ నిధుల కింద 15 లక్షల రూపాయల సిసి రోడ్డు మరియు డ్రైనేజీ  అభివృద్ధి కార్యక్రమాలకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీరంగూడ జగన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. కోర్టు కాంప్లెక్స్ లో ఇంకా జరగబోయే అభివృద్ధి పనులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అందరం కలిసి మెలిసి అభివృద్ధి పనులు జరుపుకోవాలని, అభివృద్ధి అంటే మన ఒక్కడిదే కాదు అందరు ప్రజలకు సంబంధించిందని, అభివృద్ధి కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, గ్రంథాలయ చైర్మన్ కొప్పుల మదన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు అప్పి, పెంటయ్య, శ్రావణి, నరేష్, కొప్పునూరు ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దంగు శ్రీనివాస్ యాదవ్, ఇబ్రహీం, ముబారక్ అలీఖాన్, సాదిక్ లతో పాటు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నర్వ వేణుగోపాలరావు  తదితరులు పాల్గొన్నారు.