23 May, 2026 | 1:04 PM

యాదాద్రిలో అధికారుల వైఫల్యం.. ఛాపర్ లోనే సీఎం, మంత్రులు

23-05-2026 12:01 PM

15 నిమిషాలు ఛాపర్ లోనే సీఎం, మంత్రులు                               

యాదాద్రి భువనగిరి,మే23(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) యాదగిరిగుట్టలో రూ.99.55 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేసేందుకు శనివారం ఉదయమే వెళ్లారు. అయితే అక్కడ జిల్లా అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సీఎం, మంత్రుల హెలికాప్టర్ (చాపర్) నిర్దేశిత వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ, అక్కడ వారికి స్వాగతం పలికేందుకు కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఈ ప్రోటోకాల్ లోపం, అధికారుల సమన్వయం లేని కారణంగా సీఎం రేవంత్ రెడ్డి, తోటి మంత్రులు 15 నిమిషాల పాటు చాపర్ లోనే వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీ పర్యటనలో జిల్లా యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సచివాలయ వర్గాలు సీరియస్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో వేద పాఠశాల నిర్మాణ పనులతో పాటు మొత్తం రూ.99.55 కోట్ల ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినా అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.