23 May, 2026 | 1:04 PM

చేర్యాలలో దొంగల బీభత్సం

23-05-2026 11:54 AM

జాతీయ రహదారి లోని పలు షాప్స్ ఇండ్లలో చోరీలు 

చేర్యాల, మే 23: చేర్యాల పట్టణ కేంద్రంలో(Cheryal Town Center) దొంగలు బీభత్సం చేశారు. శుక్రవారం రాత్రి పట్టణ కేంద్రంలో వరుసగా నాలుగు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు తలకు మాస్కులు వేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. చుట్టుపక్కల వారు తెలిపిన సమాచారం ప్రకారం జాతీయ రహదారికి ఉన్న ఐ మార్ట్(I-Mart) తాళాలు పగలగొట్టి నగదును దాని పక్కనే ఉన్న ఎస్ మార్ట్ తాళాలు పగల గొట్టినారు కానీ శటర్ తెరుచుకొలేదని అన్నారు.

విటికి ఆనుకొని ఉన్న డక్కన్ చాయ్ సెంటర్(Deccan Tea Center) లో కూడా దొంగతం చేశారు. విటికి కొంచెం దూరంలో ఉన్న పట్టణ కేంద్రానికి చెందిన యంసాని కృష్ణమూర్తి ఇంట్లో  ఎవరు లేని సమయంలో దొంగతనికి పాల్పడ్డారు. దొంగతంలో ఎంత మేర సొత్తు అపహరించారనే సంచారం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న చేర్యాల సీఐ రమేష్ నాయక్,ఎస్సై అపూర్వ రెడ్డి సంఘటన స్థలాని చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెపట్టారు.చేర్యాల పట్టణంలో మొన్ననే గడితోటలో పట్టపగలు ఈ రోజు ప్రధాన రహదారికి అనుకొనే రాత్రి  దొంగతనాలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.