23 May, 2026 | 1:00 PM

రోడ్డెక్కిన ధాన్యం రైతులు

23-05-2026 11:23 AM

నిర్మల్,మే23, (విజయ క్రాంతి): పంట కొనుగోలు(Crop Procurement) కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యం కొనుగోలు పాత సంచులు లారీల కొరత పరిష్కరించాలని కోరుతూ శనివారం కుంటాల మండలంలోని(Kuntala Mandal) అందాకూరు గ్రామ రైతులు నిరసన తెలిపారు. కుంటాల కల్లూర్ రహదారిపై(Kuntala-Kallur Road) బైఠాయించిన రైతులు పంట కొనుగోలు జాప్యం చేయడం వల్ల రైతులకు తీవ్రతం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు గోని సంచులు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్సై అశోక్ ఆర్ ఐ సందర్శించి రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి హామీ ఇస్తామని చెప్పిన లారీలు వచ్చేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు నిరసన తెలుపుతున్నారు