అనర్హత పిటిషన్ పై దానం నాగేందర్ స్పందన
04-03-2026 03:09 PM
అనర్హత పిటిషన్లపై ఎలాంటి నోటీసు అందలేదు
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో(People's Plaza) ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతతో కలిసి హోలీ ఆడిన దానం డాన్స్ లు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనర్హత పిటిషన్ పై స్పందించారు. అనర్హత పిటిషన్లపై తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. నోటీసిస్తే నేరుగా తన అభిప్రాయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు తెలియజేస్తానని వెల్లడించారు. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Huzurabad BRS MLA Padi Kaushik Reddy) దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.




