18 June, 2026 | 1:55 AM

యూరియా దొరకదని రైతులు అపోహ పడొద్దు..

18-06-2026 12:44 AM

టేకులపల్లిలో యూరియా యాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్ 

టేకులపల్లి, జూన్ 17 (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బేతంపూడి సొసైటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన యూరియా వ్యాప్ ను ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్ అంకిత్ కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

గత ఏడాదిలా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే యాప్ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టారని, యూరియా అందించేది బిజెపి ప్రభుత్వమని ప్రజలందరూ, రైతులందరూ ఆలోచన చేయాలన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో రైతులకు సరిపడా యూరియా అందజేయడం లేదని వివరించారు. యూరియా దోరకదని కోందరి అపోహల వలన రైతులు యూరియా నిలువ చేసుకున్న సంధర్భం మన ప్రాంతంలో ఉందని అలాంటి అపోహలకు పోవద్దన్నారు.

గత సంవత్సరంలా ఈ సంవత్సరం ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ యాప్‌ను ప్రారంభించి రైతులకు యూరి యా అందించే ప్రక్రియను సులభతరం చేశారని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యనగ రైతులందరికీ చరవాణి వాడడం రాకపోవచ్చని, వాళ్ళందరికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అందించే యూరియా గురించి రైతులకు ముందుగా తెలియజేయాలని, ఎన్ని ఎకరాలకు ఎన్ని బస్తాలు ఇస్తున్నామనే విషయం కూడా రైతులకు వివరంగా తెలియజేయాలన్నారు.

మండలంలోని బర్లగూ డెం లాంటి దూరపు గ్రామాలకు సెల్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా రైతులకు యూరియా అందించే మార్గం వారికి చూపించాలని తెలిపారు. ముఖ్యంగా రైతులందరూ అంతర్ మార్పిడి పంటలపై దృష్టి సారించాలని, యూరియా వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. స్ధానికంగా యాప్  ఫ్రారంభించిన అనంతరం యాప్ ద్వారా యూరియా నమోదు చేసుకున్న రైతులకు కలెక్టర్, ఎమ్మెల్యేల  చేతుల మీదుగా యూరియాను అందజేశారు. 

బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, జిల్లా నోడల్ అధికారి విద్యాచందన, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఇల్లందు వ్యవసాయ సహాయ సంచాలకులు లాల్ సింగ్, జిల్లా వ్యవసాయ సహాయ అధికారి శ్రీనివాస్, ఏఓ అన్నపూర్ణ, స్థానిక సర్పంచ్ బాలు నాయక్, సొసైటీ కార్యదర్శి పొన్నోజు ప్రేమాచారి, టేకులపల్లి మండల పార్టీ అధ్యక్షులు లక్కినేని శ్యామ్, నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఖాదర్ బాబు, పలు గ్రామాల సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.