28 July, 2026 | 1:38 AM

నిధులు డ్రా చేయడమే లక్ష్యమా?

28-07-2026 12:42 AM

తీర్మానం లేకుండానే అవసరం లేని పనులు ఎందుకు?

అసలే ఎలినో ప్రభావం.. నిధులు దుర్వినియోగం చేస్తే ఎట్లా?

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మల్లాపూర్ గ్రామస్తులు 

ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకనే.. లేని పనులకు శ్రీకారం 

ఏమైనా సర్పంచ్‌నే అడగండి: పంచాయతీ కార్యదర్శి 

కోయిల్ కొండ జూలై 27: ప్రజలకు మంచి చేయాలని గొప్ప లక్ష్యంతో గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు చేసి చేయాల్సిన అత్యవసర పనులను పక్కనపెట్టి ఆ గ్రామంలో నిధులు స్వాహా చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. ఎవరికి చెప్పాలో ఏమని చెప్పాలో తెలియని పరిస్థితిలో గెలిచారు కదా ఇంక ఏమి చేస్తాం అనే విధంగా మౌనం పాటిస్తూ లో లోపలనే గ్రామస్తులు మదన పడుతుండ్రు.

ఆ గ్రామమే కోయిలకొండ మండలం పరిధిలోని మల్లాపూర్ గ్రామం. గ్రామంలో డ్రైనేజీ లతోపాటు అత్యవసర పనులు ఎన్నో ఉన్నప్పటికీ ఆ గ్రామానికి బీటీ రోడ్డు ఉన్నప్పటికీ ఆ రోడ్డు పక్కన గడ్డిని తొలగిస్తూ ఎవరికి ఉపయోగం లేని పనులను చేస్తూ నిధులు స్వాహా చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని ఆ గ్రామస్తులు అసంతృ ప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నప్పటికీ ఎలాంటి నిబంధనలను పా టించకుండా తీర్మానాలు చేయకుండా ఇ లాంటి పనులు చేయడమేంటని వారు ప్ర శ్నలు లేవనెత్తుతుండ్రు. 

మంచి పనులకు ఉపయోగిస్తే ప్రశంసలు రావా?

ఉన్న బీటీ రోడ్డు చుట్టూ ఏమాత్రం గడ్డి వేపుగా లేకపోయినప్పటికీ ఆ గడ్డిని జెసిబిల సహాయంతో తొలగిస్తూ నిధులు డ్రా చేసేందుకు చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం అడపదడప వర్షాలు పడతాయి గడ్డి తిరిగి పెరుగుతుంది ఇలాంటి పనులకు డబ్బులు వృధా చేస్తే ఏమి ఉపయోగం అంటు విమర్శిస్తున్నారు.

ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామస్తులకు పూర్తిస్థాయిలో సమా చారం ఇవ్వకుండానే ఇలాంటి పనులు చే యడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వి షయంపై సంబంధిత గ్రామ పంచాయతీ కా ర్యదర్శి తో పాటు సర్పంచ్ని వివరణ పోయినప్పటికీ తర్వాత మాట్లాడుకుందాం అంటు న్నారే తప్ప ఇది ఎందుకు చేయాల్సి వస్తుం ది అనే సమాధానం మాత్రం రావడం లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఏమైనా సర్పంచ్‌నే అడగండి..

బిటి రోడ్డు పక్కన జెసిబి సహాయంతో గడ్డిని తొలగించడం విషయంతో పాటు మరే విషయమైనా సర్పంచ్ తో చర్చించండి. వారు వివరాలన్నీ చెబుతారు. తీర్మానాల విషయంతో పాటు అన్ని విషయాలు వారు తెలియజేస్తారు.

మౌనిక, మల్లాపూర్ పంచాయతీ కార్యదర్శి