8 July, 2026 | 10:03 AM

ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు బెదిరింపులా?

08-07-2026 08:54 AM

గద్వాల టౌన్: 25వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ మోహన్ యాదవ్‌కు ఫోన్‌లో దూషిస్తూ ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డారని 22వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త వంట భాస్కర్‌పై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.25వ వార్డుకు సంబంధించిన ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడాన్ని జీర్ణించుకోలేకే ఈ బెదిరింపులు వచ్చాయని మోహన్ యాదవ్ ఆరోపించారు.ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ప్రజాప్రతినిధులను బెదిరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్న బీఆర్ఎస్ నాయకులు,ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.