8 July, 2026 | 10:04 AM

అర్ధరాత్రి ఎంజీయూ వీసీ గెస్ట్ హౌస్ వద్ద బాలికల ఆందోళన

08-07-2026 08:56 AM

తాగునీరు, మెస్ సమస్యలపై విద్యార్థినుల నిరసన

నల్గొండ: టౌన్ జులై 8: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం(Mahatma Gandhi University) బాలికల హాస్టల్‌లో  వాష్ రూమ్ లో  నీటి కొరతతో విసిగిపోయిన విద్యార్థినులు మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు వీసీ గెస్ట్ హౌస్ ఎదుట ఆందోళన నిర్వహించారు.గత కొంతకాలంగా హాస్టళ్లకు రావాల్సిన నీటిని నూతన భవనాలకు మళ్లిస్తుండటంతో రోజువారీ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లినా కేర్‌టేకర్లు, వార్డెన్లు స్పందించలేదని ఆరోపించారు.వాష్ రూమ్ కు,తాగునీరు,  వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆరోగ్యం, పరిశుభ్రత, చదువుపై ప్రభావం పడుతోందని తెలిపారు.

విద్యార్థినుల ప్రధాన డిమాండ్లు

- హాస్టల్‌కు వెంటనే నీటి సరఫరా పునరుద్ధరించాలి

- మెస్ నిర్వహణలోని సమస్యలు పరిష్కరించాలి  

- ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలి

- నిర్లక్ష్యం వహించిన కేర్‌టేకర్లు, వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి.వీసీ స్పందించకపోతే మరింత ఉధృతంగా ఆందోళనలు చేస్తామని విద్యార్థినులు హెచ్చరించారు.