రూ.85 లక్షలతో మార్కెట్ యార్డ్ కార్యాలయ భవనానికి భూమిపూజ
08-07-2026 08:52 AM
ఆత్మకూరు: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో రూ.85 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ కార్యాలయ భవనానికి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం భూమిపూజ చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్కెట్ యార్డ్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రహమతుల్లా, రాష్ట్ర కల్లు గీత సహకార కార్పొరేషన్ వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ నాగమణి, వైస్ చైర్‌పర్సన్ శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.






