30 April, 2026 | 2:51 AM

లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవలో మంత్రి తుమ్మల

30-04-2026 01:30 AM

ఖమ్మం టౌన్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): స్థంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం మంత్రి తుమ్మల స్వామి వారి జయంతి ఉత్సావల్లో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ స్వామి వారి సేవలో పాల్గొనటం, స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించటం తన అదృష్టమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారి దయ అందరిపై ఉండాలని, ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా రైతాంగానికి కరువు కాటకాలు లేకుండా ఉగ్ర నరసింహ స్వామి దయ ఉండాలని ప్రార్థన చేసినట్లు తెలిపారు.