ఘనంగా ఎర్త్ వీక్ కార్యక్రమాలు
స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహణ
హైదరాబాద్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): ఎర్త్ డే (ఏప్రిల్ 22) సందర్భంగా స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ వుమెన్ (అటానమస్) లో ఈ నెల 22 నుంచి 29 వరకు ఎర్త్ వీక్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించడం, స్థిరమైన జీవన విధానాలను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమా లను చేపట్టారు.ఎర్త్ వీక్‌లో భాగంగా కళాశాల ప్రాంగణంలో విస్తృతంగా మొక్కల నాటి, వాటి సంరక్షణపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించారు. వారం రోజులపాటు నిర్వహించిన ఎర్త్ వీక్ కార్యక్రమాలలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కె కృష్ణారావు, మేనేజ్మెంట్ సభ్యుడు ఆర్ ప్రదీప్ రెడ్డి , కళాశాల డీన్ ప్రొఫెసర్ ఏ వినయ బాబు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ రమేష్ పాల్గొని పర్యవేక్షించారు.






