3 July, 2026 | 9:30 PM

Breaking News

మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •  

మంథని మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి మృతి నియోజకవర్గ ప్రజలకు తీరనిలోటు

06-02-2026 12:24 AM

ఆయనే ఎమ్మెల్యేగా పేద ప్రజలకు ఎంతో సేవ చేశారు

మంథనిలో రాంరెడ్డి భౌతిక దయానికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఫిబ్రవరి ౫ (విజయక్రాంతి): మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి మృతి నియోజక వర్గ ప్రజలకు, కుటుంబ సభ్యులకు తీరనిలోటని, ఆయనే ఎమ్మెల్యేగా పేద ప్రజలకు ఎంతో సేవ చేశారనిమంథనిలో రాంరెడ్డి భౌతిక దయానికి నివాళులర్పించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాంరెడ్డి గత రెండు రోజుల క్రితం హైదరాబాదులో అనారోగ్యంతో మృతి చెందగా ఆయన పార్థివ దేహాన్ని బుధవారం రాత్రి మంథని లోని వారి స్వగృహానికి తీసుకు వచ్చారు.

అక్కడ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు రామిరెడ్డికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంథని నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోని వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సూరాయ పల్లి, కాకర్లపల్లి, ఇప్పలపల్లి మీదుగా సీతంపేట శివారులోని వ్యవసాయ క్షేత్రంలో భారీ ఎత్తున పాల్గొన్న అభిమానుల మధ్య రామిరెడ్డి భౌతికదేహాన్ని తరలించి కుమారులు అంత్యక్రియలు పూర్తి చేశారు. మంథని నియోజక వర్గం నుంచే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రామిరెడ్డి తో అనుబంధం ఉన్న అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామ్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని వారు నెమరు వేసుకున్నారు.