calender_icon.png 6 February, 2026 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండను స్మార్ట్ సిటీగా చేసి తీరుతా..

06-02-2026 12:25:42 AM

  1. 2వేల కోట్లపైగా నిధులతో నల్లగొండ పట్టణాన్ని అభివృద్ది చేశాం
  2. కార్పొరేషన్‌గా మరింత అభివృద్ధి చేసుకుందాం
  3. బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే వృథా అవుతుంది
  4. ఫోన్ ట్యాపింగ్ భార్య భర్తల మాటలు విన్నారు..
  5. పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి ఏం మాట్లాడారో అందరికీ తెలుసు..
  6. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ టౌన్,  ఫిబ్రవరి 5 : నల్లగొండలో స్మార్ట్ సిటీ గా అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గురువారం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ పట్టణంలోనీ పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 1వడివిజన్ నుంచి పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి ఆలకుంట్ల నాగరాజు,2వడివిజన్ నుంచి పోటీ చేస్తున్న గురిజాల నరేందర్,3వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న గాలి వినోద,19వ డివిజన్ గోగుల గణేష్,18వ డివిజన్ గడిగ హిమబిందు,40వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి శ్రీనివాస్,

39వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అల్లి మల్లికార్జున్,38వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బోయపల్లి వేదశ్రీ,37వ డివిజన్ నంద్యాల వీర బ్రహ్మానంద రెడ్డి,36వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థి పుట్ట వెంకన్న గౌడ్,35వ డివిజన్‌ఇటికాలమంగమ్మ-శ్రీనివాస్నుగెలిపించాలని కోరారు.ఈ ఎన్నికలు పేద ప్రజలకు మేలు చేసే ఎన్నికలని చెప్పారు.ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, చీరలు అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 200యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.

ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున అర్హులైన ప్రతి పేదవారికి సొంతిల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు పేదలకు మాత్మ గాంధీ యూనివర్సిటీ సమీపంలో ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. ఒక్కొక్కటిగా అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పారు. 48 డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్లు గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి నల్లగొండకు ఎక్కువ నిధులు తెస్తానని అన్నారు.

2వేల కోట్ల పైగా నిధులతో నల్లగొండ పట్టణాన్ని అభివృద్ది .చేస్తున్నాం.అని బిఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు. ఓటు వేస్తే వృధా అవుతుందనీ, తెలిపారు విద్యానగర్ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామనితెలిపారు ప్రజలు నామీద నమ్మకంతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని కెసిఆర్ దత్తత తీసుకుంటానని చెప్పడంతో ప్రజలు మోసపోయి ఒక్కసారి ఓటు వేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలారని ఎద్దేమో చేశారు ఈనెల 8న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభ గురించి మీడియా ప్రశ్నించగా డిఆర్‌ఎస్ బిజెపి దుకాణం బంద్ అయిందని ఇక పవన్ వచ్చి ఏం చేస్తాడని తెలంగాణ గురించి ఏం మాట్లాడాలో అందరికి తెలుసని ఆంజనేయ స్వామిని దండం పెట్టుకొని వెళితే మంచి జరుగుతుందని సూచించారు.

రాష్ట్రమంతటా క్లీన్ షిప్....

రాష్ట్ర మొత్తం మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్లు కాంగ్రెస్ క్లీన్ షిప్ చేస్తుందని మంత్రి మీడియాతో అన్నారు కెసిఆర్ పాదాల పాలనలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు ఫోన్ ట్యాప్ చేసి సినీ హీరోలది భార్యాభర్తల ఫోన్లు విన్నారని నల్గొండలో ఇండస్ట్రియల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.