31 July, 2026 | 3:08 AM

షిరిడీ సాయిబాబాకు మంత్రి శ్రీధర్‌బాబు పూజలు

31-07-2026 01:47 AM

దిల్‌సుఖ్‌నగర్‌లో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు 

ఎల్బీనగర్, జులై 30 : దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి దిల్ సుఖ్ నగర్  సాయిబాబా దేవాలయంలో సాయినాథుడిని దర్శించుకున్నారు. ఆలయంలో సాయిబాబాకు  అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు, మధుయాష్కీగౌడ్ సాయినాథుడికి బంగారు కిరీటం, బంగారు బిళ్లపత్ర మాలను ప్రతిష్టింపజేశారు. ఈ సందర్భంగా పండి తులు వారికి ఆశీర్వాదం అందించగా.. దేవాలయ కమిటీ ప్రతినిధులు  ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ స్పో క్స్ పర్సన్ వేదిరె యోగేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు తులసి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు సునీల్ బాబు, మాజీ అధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్, శశిధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రేమ్ నాథ్ గౌడ్ గారు, సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ లింగయ్య, నాయకులు బాబ్బూరి ఆనంద్ గౌడ్, దాము మహేందర్ యాదవ్, నాగార్జున రెడ్డి, శరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.