28 February, 2026 | 6:02 PM

పెద్దమ్మ ఆలయంలో హుండీ చోరీ

28-02-2026 03:07 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): పెద్దమ్మ తల్లి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీని అపహరించిన సంఘటన తాండూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని తాండూర్ గ్రామంలో గల పెద్దమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలో ఉన్న హుండీని శుక్రవారం రాత్రి నేల నుండి తొలగించి

హుండీలో ఉన్న రంధ్రం ద్వారా చేయి లోపలికి పెట్టి అందులో ఉన్న నగదు మొత్తాన్ని దొంగలించారు. ఈ విషయము గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్కు తెలియపరచగా వెంటనే ఎస్ఐ.భార్గవ్ గౌడ్ పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి ఫిర్యాదారునికి ఎఫ్ఐఆర్ ప్రతిని ఉచితంగా అందజేయడం జరిగిందని ఎస్ఐ.భార్గవ్ గౌడ్ తెలిపారు.