28 August, 2026 | 5:17 AM

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు

28-08-2026 12:00 AM

మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచన

కమాన్ పూర్  ఆగస్టు 27 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్ల శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోరుకొప్పుల సత్యనారాయణ గౌడ్ గుండెపోటుతో కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గురువారం ఆసుపత్రికి వెళ్లి సత్యనారాయణ గౌడ్ను పరామర్శించారు.అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ గౌడ్కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మంత్రి వెంట గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,స్థానిక కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.