28 August, 2026 | 2:42 AM

కోడిని నోట కరిచి డాన్స్..!

27-08-2026 11:55 PM

- బోనాల ఉత్సవాల్లో డాన్సర్ల వికృత చేష్టలు

- డాన్సర్స్ గ్రూప్ నిర్వాహకులపై కేసు నమోదు

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 25న నిర్వహించిన ఈదమ్మ, పోచమ్మ బోనాల ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో డాన్సర్ల వికృత చేష్టలు కలకలం రేపాయి. కాంచన సినిమాలోని పాటకు నృత్యం చేస్తూ డాన్సర్ దుర్గాప్రసాద్ బతికి ఉన్న కోడిని నోట కరిచి డాన్స్ చేయడంతో అక్కడున్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రీతి అనే ఎన్జీవో ప్రతినిధి నాగర్‌ కర్నూల్ పోలీసులను ఆశ్రయించారు. డాన్సర్ దుర్గాప్రసాద్‌తో పాటు రేలారే మనోజ్, ప్రోగ్రాం ఆర్గనైజర్ స్థానిక కౌన్సిలర్, తిమ్మాజిపేట పాండులపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.