17 April, 2026 | 3:45 AM

పెట్టుబడులను ప్రోత్సహించండి

17-04-2026 02:01 AM
  1. అమెరికా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
  2. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో రాష్ట్రం ‘అవకాశాల ఖని’
  3. ఏటా వృద్ధి రేటు 30 శాతం, ఎగుమతుల్లో 103 శాతం నమోదు
  4. యూఎస్ నేషనల్ కాలేజ్ వార్’ ప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధర్ బాబు 

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని, ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.

డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్ట మ్స్, ఏరోస్పేస్ కాంపోనెంట్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ, ఏఐ ఇన్ డిఫెన్స్, శాటిలైట్స్ సిస్టమ్స్ అండ్ అడ్వానస్డ్ కమ్యూనికేషన్స్‌లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేలా తమ ప్రభు త్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.

సచివాలయంలో గురువారం ‘యూఎస్ నేషనల్ కాలేజ్ వార్’ బృంద సభ్యులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యా రు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలు, ఇక్కడి అను కూలతలు, ఈజ్ ఆఫ్ డూయిం గ్ బిజినెస్ పాలసీలు మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. రాకెట్ల తయారీ నుంచి అత్యాధునిక డ్రోన్ల వరకు, యుద్ధ విమానాల విడి భాగాల నుంచి శాటిలైట్ల వరకు... అన్నింటిలోనూ ‘మేడిన్ తెలంగాణ’ మార్క్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందన్నారు.

ఈ రంగం (ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్)లో తెలంగాణ ఏటా 30 శాతానికి పైగా వృద్ధిని రేటును నమోదు చేస్తోందన్నారు. అలాగే.. 2024- మధ్య కాలంలో ఎగుమతుల్లో 103 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) నమోదయ్యిందన్నారు. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, ఎయిర్ బస్, డస్సాల్ట్ ఏవియేషన్ తదితర ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్ కంపెనీలతో డీఆర్డీవో, భెల్, మిధాని, బీడీఎల్, ఆర్ సీఐ, హాల్ తదితర కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు.

ఇవీ కాకుండా... ప్రిసిషన్ ఇంజనీరింగ్, డ్రోన్లు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 1,500 కంటే ఎక్కువ ఎంఎస్‌ఎంఈలు తెలంగాణ బ్రాం డ్’ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్ డీఏ ర్యాంకింగ్స్ ప్రకా రం, ప్రపంచంలోనే అత్యంత ‘కాస్ట్ ఎఫెక్టివ్ ఏరోస్పేస్ సిటీ’గా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా ఐదుసార్లు ‘బెస్ట్ స్టేట్ ఫర్ ఏరోస్పేస్’ అవార్డును గెలుచుకుని ‘గ్లోబల్ ఏరోస్పేస్ మ్యాప్’లో తెలంగాణ ఒక శక్తిమంతమైన కేంద్రంగా మారిందన్నారు.

టీజీ ఐపాస్ ద్వారా 15 నుంచి 30 రోజుల్లోగా అనుమతులు, యంగ్‌ఇండియా స్కిల్ యూ నివర్సిటీ ద్వారా ఈ రంగానికి అవసరమైన రెడీ టూ స్కిల్ వర్క్ ఫోర్స్’ను అందిస్తున్నామన్నారు. పెట్టుబడులకు మాత్రమే కాదు,  అమెరికాకు నమ్మకమైన దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామిగా నిలిచేందుకు ‘తెలంగాణ’ సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, అడ్వానస్డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, స్పేస్ టెక్నాలజీ తదితర రంగాల్లో అమెరికా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో కలిసి పనిచే స్తామన్నారు. ‘తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు చొర వ చూపుతాం’ అని స్టేట్ డిపార్ట్ మెంట్ మినిస్టర్ కౌన్సిలర్ పాల్ నరైన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కెప్టెన్ ఫ్రాంక్ ఒకటా(నేవీ), రెనో బామ్ఫోర్డ్(డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ), లెఫ్టినెంట్‌కల్నల్ జాన్ కయాం గ్యాంగ్(ఆర్మీ), రెబెక్కా కింగ్(డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ), లెఫ్టినెంట్ కల్నల్ మైఖేల్ కూబ్(ఎయిర్ నేషనల్ గార్డ్), జోస్ సలాస్(డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏజెన్సీ), టీజీఐ ఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.