వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం
17-04-2026 09:49 AM
అడ్వాన్స్‌డ్ జెరియాట్రిక్ రీహ్యాబ్ సెంటర్ ప్రారంభోత్సవంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని, ఏప్రిల్ 17(విజయ క్రాంతి): సమాజం లో వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమని, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న కైట్స్ సీనియర్ కేర్‌లో ఆధునిక సౌకర్యాలతో కూడిన అడ్వాన్స్‌డ్ జెరియాట్రిక్ రీహ్యాబ్ సెంటర్ ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందించడం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆస్పత్రి ఏర్పాటు చేసిన వైద్య బృందాన్ని శ్రీనుబాబు అభినందించారు.






