మెడపాటి ప్రకాష్ రెడ్డిని బోయికులస్తులు సన్మానించారు
05-07-2026 03:32 PM
బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని 15వ వార్డు కాంటెస్ట్ కౌన్సిలర్ కందికట్ల శ్రీనివాస్ (వాసు) ఆధ్వర్యంలో బోయి సంగం అధ్యక్షులు, కమిటీ సభ్యులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోయి సంగం ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న గంగమ్మ దేవాలయానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. దీనిపై మేడపాటి ప్రకాష్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ఎంపీ నిధుల ద్వారా అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.






