ఉపాధి, ఉద్యోగ అవకాశాలకై యువత ఉద్యమించాలి
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు. శ్రీను పిలుపు
నేరేడుచర్ల,(విజయక్రాంతి): ఉద్యోగ,ఉపాధి అవకాశాలకై యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు చిలకరాజు శ్రీను పిలుపునిచ్చారు.ఆదివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో జరిగిన ఏఐవైఎఫ్ పట్టణ, మండల మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిoదని, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడబెరికి నిరుద్యోగ సమస్యలు మరింతగా పెంచారు.
తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా యువతను మోసం చేసిందని ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసం చేస్తూ పాలన కొనసాగిస్తున్నాయని ఈ విషయాన్ని యువత గమనంలోఉంచుకొని సరైన సమయంలో సరైన రీతిలో గుణపాఠం నేర్పాలని అన్నారు. యువత దేశభక్తిని అణువణువునా నింపుకొని ముందుకు కొనసాగాలని, దేశ సమైక్యత సమగ్రతకు అంకితం కావాలని సమాజంలోని మిగతా యువతకు ఏఐవైఎఫ్ లో పనిచేసే యువత ఆదర్శంగా ఉండాలని కోరారు.






