ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు
జమ్మికుంట మే 8(విజయ క్రాంతి)తెలంగాణ రాష్ట్ర బీసీ , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ పత్తి మార్కెట్ ఆవరణలో మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ పాలకవర్గం, మంత్రి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేసి, రైతులకు కార్మికులకు మజ్జిగ వితరణ జరిపారు.
అనంతరం మార్కెట్ చైర్ పర్సన్ మాట్లాడుతూ... తెలంగాణ ఆవిర్భావంలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రభుత్వములో భాగస్వామిగా ఉంటూనే తెలంగాణ ఏర్పాటుకు కోసం పోరాటం చేసి పెప్పర్ స్ప్రే దాడులకు గురైన ఎక్కడ వెన్నుచూపని నాయకుడని కొనియాడారు. మంత్రి పోరాట పటిమను చూసిన భారత దేశ నాయకులు తెలంగాణ టైగర్ గా పిలుస్తున్నారని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో నేటి ప్రజాప్రభుత్వం బీసీ కులగణన దిగ్విజయంగా పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
రాష్ట్ర రవాణా శాఖను పూర్తస్థాయి డిజిటల్ చేసి కేంద్రప్రభుత్వ ప్రశంశలు అందుకున్న విజన్ ఉన్న నాయకుడు అన్నారు. నిరుపేదల అభివృద్ధి దేంగా పనిచేస్తున్న మంత్రి మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి. డైరెక్టర్లు దిక్షిత్. రాజేశ్వరరావు. శ్యాం. కందల తిరుపతి. మనుపటి సూర్య. శ్రీనివాస్ రెడ్డి ల తో పాటు వ్యాపారులు, కార్మికులు, రైతులు పాల్గొన్నారు.






