బాధ్యతల స్వీకరణకు ముందే రాజీనామా
కరీంనగర్, మే8(విజయక్రాంతి):కరీంనగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నియామకం వివాదా5స్పదంగా మారింది. నూతనంగా ప్రకటించిన వైస్ ఛైర్మన్ పదవికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాజీ ఎంపీపీ సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సీనియర్లను కాదని కొత్తగా వచ్చిన వారికి ఛైర్మన్ పదవి ఇచ్చారని లక్ష్మీనారాయణ గౌడ్ ఆరోపించారు. పదవుల ను డబ్బులకు అమ్ముకున్నారని ఆయన విమర్శించారు.వెంటనే నియామక ఉత్తర్వులను రద్దు చేసి, తనకు ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.చైర్మన్ గా ఆకుల నర్సయ్య, వైస్ చైర్మన్ గా ఎస్ ఎల్ గౌడ్ ను నియమించారు. ఎస్ ఎల్ గౌడ్ చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాడు. ఇతను మంత్రి పొంన్నం ప్రభాకర్ అనుచరుడు. తాజాగా కరింనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వెలిచాలవరాజేందర్ రావు ఆకుల నర్సయ్య ని తెరమీదికి తెచ్చి పంతం నెగ్గించుకున్నారు నర్సయ్య కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా వెలిచాల ప్రకటించిన ఫలితం దక్కలేదు. నర్సయ్య ను ఎం ఎం సి కుర్చీలో కూర్చుంద పెట్టడం ఎస్ ఎల్ గౌడ్ ఆగ్రహానికి కారణంయింది. ఆయన మార్కెట్ పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేశారు.






