ఆర్టీసీ సమ్మె.. ఆ కుట్రలో భాగమే.. బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిందే దోపిడీ!
ఆర్టీసీ కార్మికులను హరీశ్ రావు సమ్మెకు ప్రోత్సహించారు.
మహాలక్ష్మీ పథకం నచ్చకే ఆర్టీసీపై కుట్రలు
బీఆర్ఎస్ పార్టీకి కావాల్సిందే దోపిడీ
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులను మాజీమంత్రి హరీశ్ రావు సమ్మెకు ప్రోత్సహించారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆరోపించారు. జేఏసీ నేతలు ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడి సమ్మెకు వెళ్లారని తెలిపారు. అధికారులతో చర్చల మధ్యలో జేఏసీ నేతలు వెళ్లిపోయారని వివరించారు. అధికారులు చర్చిస్తుండగానే సమ్మెకు(RTC Strike) వెళ్లడం కుట్రలో భాగమే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసేలా వ్యవహరించిందన్నారు. మహాలక్ష్మీ పథకం నచ్చకే ఆర్టీసీపై కుట్రలు చేస్తున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది దోపిడీ మాత్రమేనని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.






