8 July, 2026 | 1:40 AM

అఫ్గన్ మాజీ క్రికెటర్ జద్రాన్ కన్నుమూత

08-07-2026 12:35 AM

న్యూఢిల్లీ, జూలై 7: అఫ్గనిస్థాన్ క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఆ దేశ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ కన్ను మూశాడు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ధ్రువీకరించింది. షాపూర్ జద్రాన్ గత కొంతకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి కారణంగా అతడి శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య పూర్తిగా పడిపోయింది.

ఈ క్రమంలో గత కొన్నినెలలుగా న్యూఢిల్లీలోని ఆస్పత్రిలో ఉన్న షాపూర్ జద్రాన్ తాజాగా తుదిశ్వాస విడిచాడు. ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తు ఉండే ఆ స్పీడ్‌స్టర్ చాలాకాలం అభిమానులను అలరించాడు. అఫ్గాన్ తరఫున 2009- మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. కెరీర్లో 44 వన్డేలు, 36 టీ20లు ఆడిన జద్రాన్ మూడుసార్లు టీ20 ప్రపంచకప్ జట్లలో భాగమయ్యాడు. షాపూర్ జద్రాన్ మరణం పట్ల అఫ్గాన్ క్రికెట్ బోర్డు, సహచర క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.