కేసీఆర్, రేవంత్ కాంప్రమైజ్ పాలిటిక్స్
హైదరాబాద్: కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay ) ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను కాపాడేందుకు రేవంత్ రెడ్డి శత విధాలా ప్రయత్నిస్తున్నారని బండి సంజయ ఆరోపించారు.
కేసీఆర్, రేవంత్ కాంప్రమైజ్ పాలిటిక్స్ కు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(Kaleshwaram Lift Irrigation Project) నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పెద్దలకు మూటలు వెళ్తున్నాయి...ఇక్కడ కేసులు మూసేస్తున్నారని కేంద్రమంత్రి స్పష్ట చేశారు. కేసీఆర్, రేవంత్ క్విడ్ ప్రోకోను ప్రజలే గమనిస్తున్నారని బండి సంజయ్ హెచ్చరించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఘోష్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది.






