8 July, 2026 | 1:40 AM

అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందించాలి

08-07-2026 12:39 AM

మంత్రి అడ్లూరి

బుగ్గారం, జూలై 7 (విజయక్రాంతి): అం గన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, బా లింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం  జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత్ రావు పేట గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ. 12 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్ వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం చిన్నారులకు పౌష్టిక ఆహారం అం దించడంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను అం దిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బాలింతల వి షయంలో సైతం ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్త లు తీసుకుంటుందని మంత్రి వివరించారు. అంగన్వాడి సేవలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట గ్రామ సర్పంచ్ ఉరుమట్ల లక్ష్మీ బుచ్చ య్య, మాజీ జెడ్పిటీసీ బాధినేని రాజేందర్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.