18 July, 2026 | 3:04 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు మృతి   •  

పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!

18-07-2026 02:46 PM

కూసుమంచి, జులై 18(విజయక్రాంతి): పచ్చని చేలల్లో వరి నాట్లు వేస్తూ.. పల్లె ప్రగతికి ప్రాణం పోస్తున్న శ్రమజీవుల చెంతకు పాలేరు ఆత్మీయ బంధువు కదిలివచ్చారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా మల్లాయిగూడెం ముగించుకుని మార్గమధ్యంలోని లింగారం తండా, జుజ్జులరావ్ పేట గ్రామ శివార్ల మీదుగా కోక్యా తండాకు వెళ్తున్న క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అక్కడ శ్రమిస్తున్న మహిళా కూలీలను చూసి తన కాన్వాయ్‌ను ఆపి వాహనం దిగారు. హోదాల సరిహద్దులు వీడి, నిరాడంబరంగా నేరుగా ఆ పల్లె పడతుల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను,  అవసరాలను ఎంతో ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి పేదవారికి  రాజకీయం లేని 'ఇందిరమ్మ ఇళ్ల' వెలుగులు అందిస్తామని, ఉచిత కరెంట్, సంక్షేమ పథకాల తోడుంటామని ఆయన ఇచ్చిన భరోసా, ఆ పల్లె జనాల ముఖాల్లో కొండంత ఆనందాన్ని, కొత్త నమ్మకాన్ని నింపింది.