18 July, 2026 | 2:00 PM

పాఠశాల విద్యార్థినిలపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు

18-07-2026 01:59 PM
  1. బాన్సువాడ మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఘటన...
  2. ఇద్దరు ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగింపు...
  3. పోలీసుల కేసు నమోదు దర్యాప్తు...

బాన్సువాడ, జూలై 18 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఓ ఆదర్శ పాఠశాలలో (Model School)పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినిలపై లైంగిక వేధింపులు(Teachers harassment) చేసిన ఘటన కలకలం రేపింది. పాఠశాల ఉపాధ్యాయులపై వచ్చిన ఫిర్యాదులు కలకలం రేపాయి. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న గోపాల్, పవన్ అనే ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో విద్యార్థినుల ఆరోపణలు నిజమేనని తేలడంతో వారిద్దరిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు జిల్లా విద్యాధికారి మల్లికార్జున్ తెలిపారు. అలాగే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపడుతున్నారు.విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.